టర్కీలో అతిపెద్ద ఫీల్డ్ హాస్పిటల్‌ను ప్రారంభించిన యూఏఈ
- February 14, 2023
యూఏఈ: భూకంపంలో తీవ్రంగా నష్టపోయిన టర్కీలో టర్కీలోని గాజియాంటెప్‌లో అతిపెద్ద ఫీల్డ్ హాస్పిటల్‌ను యూఏఈ ప్రారంభించింది. ఆసుపత్రి 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇందులో 50 పడకలు, నాలుగు ICU పడకలు సేవలకు సిద్ధమయ్యాయి. ఇది టర్కీలోని మొదటి (స్థాయి III) ఫీల్డ్ హాస్పిటల్ గా గుర్తింపు పొందింది. యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ ప్రారంభించిన ''గాలంట్ నైట్/2''లో భాగంగా జరిగిన ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి టర్కీలోని యూఏఈ రాయబారి సయీద్ థానీ అల్ ధాహేరి, పలువురు టర్కీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్ ధాహెరి మాట్లాడుతూ.. యూఏఈ నాయకత్వం ఆదేశాల మేరకు ఫీల్డ్ హాస్పిటల్ స్థాపించబడిందన్నారు. ప్రపంచ సంఘర్షణలు, విపత్తులు సమయాల్లో యూఏఈ తన మానవతా బాధ్యతలకు, బాధితులకు అండగా నిలబడాలనే ఆసక్తిని హైలైట్ చేస్తుందని అల్ ధాహెరి చెప్పారు. రిసెప్షన్, స్క్రీనింగ్, ఎమర్జెన్సీ, సర్జరీ, ఇంటెన్సివ్ కేర్, డెంటిస్ట్రీ, ఎక్స్-రే, లేబొరేటరీ, ఫార్మసీ, ఔట్ పేషెంట్ విభాగాలతో సహా వివిధ విభాగాలు ఆసుపత్రిలో ఉన్నాయని ఎమిరేట్స్ రిలీఫ్ ఫీల్డ్ హాస్పిటల్ కమాండర్ స్టాఫ్ బ్రిగేడియర్ డాక్టర్ అబ్దుల్లా ఖడెమ్ అల్ ఘైతీ తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







