ఒక రోజులో దుబాయ్ కొత్త పౌర వివాహ సేవ: స్టెప్ బై స్టెప్ గైడ్
- February 14, 2023
యూఏఈ: దుబాయ్ కోర్టులు కొత్తగా ప్రారంభించిన ముస్లిమేతరుల పౌర వివాహ గుర్తింపును ఒక రోజులో పొందవచ్చు. ఇంతకుముందు ఎమిరేట్‌లోని ముస్లిమేతర జంటలు వారి వివాహ గుర్తింపును వారి స్వదేశంలోని రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌లో పొందేవారు. యూఏఈలోని ముస్లిమేతర జాతీయులు, ప్రవాసుల వివాహం, విడాకులు మరియు వారసత్వాన్ని కవర్ చేసే కొత్త ఫెడరల్ పర్సనల్ స్టేటస్ చట్టానికి అనుగుణంగా ఈ సేవ ఉంది. ఇది కోర్టుల ముందు వివాహ ఒప్పందాలు, డాక్యుమెంట్ ప్రక్రియలను నియంత్రిస్తుంది. జంటలు తమ పౌర వివాహ ఒప్పందాలను 24 గంటల్లో పొందవచ్చు.
మొదటగా దుబాయ్ కోర్టుల సేవా కేంద్రాన్ని సందర్శించాలి. అనంతరం డిజిటల్ ఫారమ్‌ను పూరించాలి. ఆ తర్వాత సంబంధిత ఉద్యోగి రెండు పార్టీల సమ్మతిని పరిశీలన చేస్తారు. ఆపై అభ్యర్థనను ధృవీకరించి ఎలక్ట్రానిక్‌గా సంతకం తీసుకుంటారు. అన్ని చట్టపరమైన అవసరాలను పూర్తయినట్లు ధృవీకరించి ఆ దరఖాస్తును న్యాయమూర్తికి పంపుతారు. న్యాయమూర్తి పత్రంపై సంతకం చేసిన అనంతరం వివాహ ఒప్పందం ఎలక్ట్రానిక్ పద్ధతిలో డాక్యుమెంట్ చేయబడుతుంది. దీన్ని ఇమెయిల్ ద్వారా దరఖాస్తుదారులకు పంపించబడుతుంది.
దుబాయ్ కోర్ట్స్ సర్వీస్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయంటే..
ప్రభుత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం.. సేవా కేంద్రాలు అల్ యలాయిస్, వాఫీ మాల్, అల్ బార్షా ట్రాఫిక్ బిల్డింగ్‌లో ఉన్నాయి.
సేవ కోసం రుసుము ఎంత చెల్లించాలంటే..
వివాహ ధృవీకరణ పత్రం జారీ రుసుము Dh220గా నిర్ణయించారు.
నిబంధనలు, షరతులు ఏమిటంటే..
- దరఖాస్తుదారులు తప్పనిసరిగా ముస్లిమేతరులు అయి ఉండాలి.
- పార్టీలలో ఒకరు దుబాయ్ నివాసి అయి ఉండాలి.
- ఇద్దరు దరఖాస్తుదారులు తప్పనిసరిగా 21 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







