అగ్నినక్షత్రం సినిమా గ్లింప్స్ కి అనూహ్య స్పందన
- February 14, 2023
హైదరాబాద్: మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం 'అగ్ని నక్షత్రం'. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు.లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్ వాలంటైన్స్ డే సందర్బంగా నటుడు దగ్గుపాటి రానా రిలీజ్ చేయటం జరిగింది,ఈ గ్లింప్స్ కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తుంది, త్వరలో ఈ చిత్రం యొక్క విడుదల తేదిని ప్రకటించడం జరుగుతుంది.
ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు. మధు రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
తారాగణం:
డా.మంచు మోహన్ బాబు
మంచు లక్ష్మి ప్రసన్న
సిద్దిక్
విశ్వంత్
చైత్ర శుక్ల
తదితరులు...
టెక్నిషియన్స్:
బ్యానర్-లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్
సంగీతం-అచ్చు రాజమణి
సినిమాటోగ్రఫీ-గోకుల్ భారతి
ఎడిటర్-మధు రెడ్డి
దర్శకత్వం-వంశీ కృష్ణ మళ్ల
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







