రెండు ఐఫోన్14 ఫోన్లతో దొరికిపోయిన ఎయిర్ ఇండియా పైలట్..
- February 14, 2023
ముంబై: భారత వైమానిక సంస్థ ఎయిర్ ఇండియా కొంతకాలంగా అనేక వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే.ఇటీవలి పీ గేట్ సహా పలు వివాదాలు సంస్థను అప్రతిష్టపాలు చేశాయి.ఈ తప్పిదాలకు సంస్థ భారీ జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఇవి మరిచేలోగా మరో వివాదం ఎయిర్ ఇండియా సంస్థను చుట్టుముట్టింది.ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన పైలట్ ఒకరు విదేశాల నుంచి రెండు ఐఫోన్14లు తీసుకొస్తూ ఢిల్లీ ఎయిర్ పోర్టులో దొరికిపోయాడు.దీంతో అతడికి రూ.2.5 లక్షల జరిమానా విధించారు అధికారులు. నిబంధనల ప్రకారం విదేశాల నుంచి రెండు కొత్త ఖరీదైన ఫోన్లు తీసుకురాకూడదు. కానీ, అక్కడ పన్నులు తక్కువగా ఉండటంతో అతడు ఐఫోన్ 14లు ఇండియా తీసుకొస్తూ పట్టుబడ్డాడు. దీంతో భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ అప్రమత్తమైంది. తమ క్యాబిన్ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎయిర్ ఇండియా మాతృ సంస్థ అయిన టాటా గ్రూప్ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.దీని ప్రకారం పైలట్లు, ఎయిర్ హోస్టులు సహా విమాన సిబ్బంది ఎవరూ టాటా కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ అతిక్రమించకూడదు. వాళ్లు చేసే తప్పుడు పనుల వల్ల సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుంది. అనుమతి లేకుండా విమానాలు, సంస్థలు, ప్రాంగణంలోని ఎలాంటి వస్తువును తొలగించకూడదు.ఇక పై విమానాలు గమ్య స్థానం చేరుకోగానే, సంస్థ సిబ్బందిని తనిఖీ చేస్తారు. ఒకవేళ సంస్థ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







