పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు: ఏపీ సిఎం జగన్
- February 14, 2023
అమరాతి: ఏపీ సిఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 26 పర్యాటక పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ పోలీస్ స్టేషన్లను ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీజీపీ, ఇతర పోలీస ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పర్యాటకుల భద్రత కోసం ఈ పోలీస్ స్టేషన్లను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యటకులకు భయం, ఇబ్బంది లేకుండా ఈ పోలీస్ స్టేషన్లలోని పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటారని తెలిపారు. 20 పర్యాటక ప్రాంతాల్లో 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించామని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో యాత్రికులు నిర్భయంగా గడిపేందుకు ఈ పోలీస్ స్టేషన్లు ఉపయోగపడతాయని తెలిపారు.
పోలీస్ శాఖలో ఇప్పటికే అనేక సంస్కరణలను తీసుకొచ్చామని గుర్తు చేశారు. రాష్ఠ్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలవుతోందని చెప్పారు. పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టులను పెట్టి ప్రజలకు తోడుగా నిలిచే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పోలీసులు మీ స్నేహితులే అనే భావనను తీసుచొచ్చామని చెప్పారు. ఇప్పుడు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







