యూఏఈకి ధన్యవాదాలు తెలిపిన టర్కీ అధ్యక్షుడు
- February 14, 2023
యూఏఈ: భూకంపం తర్వాత తమ దేశానికి మద్దతుగా నిలిచినందుకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్.. యూఏఈ నాయకులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్‌లో జరుగుతున్న ప్రపంచ ప్రభుత్వ సదస్సు(WGS) 2023లో టర్కీ అధ్యక్షుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. ఎర్డోగాన్ మాట్లాడుతున్న సమయంలో యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అక్కడే ఉన్నారు.
దుబాయ్‌లో ఫిబ్రవరి 13న ప్రారంభమైన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ (WGS)లో వాతావరణ మార్పు, లింగ సమతౌల్యం, వాణిజ్యం మరియు ఆర్థిక వ్యవస్థ వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను ప్రభావితం చేసే అంశాలపై చర్చించడానికి ప్రపంచ నాయకులు, అధికారులు సమావేశమయ్యారు. మూడు రోజుల పాటు( ఫిబ్రవరి 13 నుండి 15 వరకు) జరిగే ఈ సదస్సులో 150 కంటే ఎక్కువ దేశాల నుండి 20 మందికి పైగా దేశాల అధ్యక్షులు, 250 మంది ప్రభుత్వ , ప్రైవేట్ రంగ నాయకులు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







