వాణిజ్య సరళీకరణ, ఆర్థిక వృద్ధిపై ఒమన్, డబ్ల్యుటీఓ సమీక్ష
- February 15, 2023
మస్కట్: ఒమన్ వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ, వ్యవసాయం, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ)తో సమావేశం నిర్వహించాయి. అంతర్జాతీయ వాణిజ్య సరళీకరణ, ఆర్థిక వృద్ధికి మద్దతుగా WTO ప్రయత్నాలకు సంబంధించిన సమస్యలపై అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రపంచ వాణిజ్య వ్యవస్థకు మద్దతు ఇవ్వడం, వాణిజ్య ఉద్యమంలో స్థిరత్వాన్ని సాధించడం కోసం ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాల్సిన ఉత్తమ మార్గాలపై సమావేశం చర్చించింది. ఈ సందర్భంగా ఒమన్ సుల్తానేట్‌లో ఉన్న గ్రీన్ హైడ్రోజన్‌పై దృశ్య ప్రదర్శనను ప్రదర్శించారు. ఈ సమావేశానికి వాణిజ్యం, పరిశ్రమలు , బడి ప్రోత్సాహక మంత్రి ఖైస్ మహమ్మద్ అల్ యూసెఫ్.. వ్యవసాయం, మత్స్య , జలవనరుల మంత్రి డాక్టర్ సౌద్ హమూద్ అల్ హబ్సీ లతోపాటు WTO డైరెక్టర్ జనరల్ డాక్టర్ న్గోజీ ఒకోంజో-ఇవాలా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్‌కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు









