మార్చి 3 నుండి ఎక్స్పో సిటీ దుబాయ్ లో ‘హాయ్ రమదాన్’
- February 15, 2023
యూఏఈ: రమదాన్ పండుగను పురస్కరించుకొని ఎక్స్పో సిటీ దుబాయ్ ప్రత్యేక ప్రోగ్రామ్ ను ప్రకటించింది. 'హాయ్ రమదాన్' పేరుతో మార్చి 3 నుండి ఏప్రిల్ 25 వరకు ప్రత్యేక సీజన్ ను నిర్వహించనుంది. ఎక్స్పో సిటీ దుబాయ్ ఎగ్జిక్యూటివ్ క్రియేటివ్ డైరెక్టర్ అమ్నా అబుల్హౌల్ మాట్లాడుతూ.. ఎక్స్పో 2020 దుబాయ్ ప్రపంచాన్ని ఒక చోటికి చేర్చినట్లే, ఎక్స్పో సిటీ దుబాయ్‌లోని ‘హాయ్ రమదాన్’ పవిత్ర మాసంలో అన్ని ప్రాంతాల నుండి విభిన్న కమ్యూనిటీలను ఒకచోట చేర్చుతుందన్నారు. అల్ వాస్ల్ షో, స్పోర్ట్స్ యాక్టివిటీలతో సహా హై రమదాన్ కి ప్రవేశం ఉచితమని, కొన్ని వర్క్‌షాప్‌లు, గేమ్‌లకు మాత్రం సఫరేటుగా ఛార్జీలు ఉంటాయని తెలిపారు. హాయ్ రమదాన్ సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని..పవిత్ర మాసంలో సాయంత్రం 5 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు సందర్శకులకు స్వాగతం పలుకుతుందని అమ్నా అబుల్హౌల్ వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







