పవన్ కళ్యాణ్ కోసం ఆ ముగ్గురూ వెయిటింగ్.!
- February 15, 2023
ఎలక్షన్స్ లోపు ఒప్పుకున్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలి పవన్ కళ్యాణ్. చేతిలో చాలానే ప్రాజెక్టులున్నాయ్. ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌తో పవన్ బిజీగా వున్నారు.
తర్వాత ‘వినోదయసితం’ సినిమా పూర్తి చేయాలి. కొన్ని రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్. అలాగే హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా స్టార్ట్ అయ్యింది. రెగ్యులర్ షూట్ కోసం హరీష్ శంకర్ వెయిటింగ్. ఇక ముచ్చటగా మూడోది ‘ఓజీ’. ఈ మధ్యనే ఈ సినిమా కూడా పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయ్యింది.
సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడీ సినిమాకి. చూస్తుంటే, ఈ మూడు ప్రాజెక్టులూ పవన్ అర్జెంట్‌గా కంప్లీట్ చేయాల్సినవే. కానీ, ఏ ఒక్కటీ ఇంకా సెట్స్ మీదికి వెళ్లలేదు. ‘హరి హర వీరమల్లు’ పీరియాడిక్ డ్రామా కావడంతో, అది పూర్తి చేశాకే పవన్ ఈ సినిమాలపై దృష్టి పెడతాడో ఏమో.!
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







