బ్రిటన్ రాజవంశం కీలక నిర్ణయం..
- February 15, 2023
లండన్: మరో మూడు నెలల్లో బ్రిటన్ రాజు చార్లెస్ 3 పట్టాభిషకం జరుగనుంది. ఈ సమయంలో రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టాభిషేకంలో కోహీనూర్ వజ్రాన్ని వినియోగించకూడదని ప్రతిపాదించింది. వలస రాజ్యాల పాలనకు గుర్తుగా బ్రిటన్ రాజ కుటుంబం చేతిలో ఉన్న వివాదాస్పద కోహీనూర్ వజ్రం లేని కిరీటంతోనే తన భర్త చార్లెస్ 3 పట్టాభిషేక మహోత్సవానికి హాజరు కావాలని బ్రిటన్ రాణి కెమిన్ లా నిర్ణయించారు. ఈ విషయాన్ని బకింగ్ హోమ్ ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి.
క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమంలో ఈ వజ్రాన్ని వినియోగించాలని తొలుత భావించినప్పటికీ చివరకు ఆ ఆలోచనను పక్కన పెట్టారు. ఈ కిరీటానికి బదులు క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమెల్లా ధరించనున్నారు. ఇప్పటికే కెమిల్లాకు అనుకూలంగా ఉండేందుకు కిరీటం పరిమాణంంలో మార్పులు చేస్తున్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కు చెందిన నగలను ఈ కిరీటంలో పొదగనున్నారు. ఇక ఈ ఏడాది మే 6న బ్రిటన్ రాజు చార్లెస్ 3 పట్టాభిషేకం జరుగనుంది.
లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో పట్టాభిషేకం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనుంది. అదే సమయంలో క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. ఏడు దశాబ్ధాల పాటు బ్రిటన్ ను పాలించిన క్వీన్ ఎలిజబెత్ 2 కిరీటంలో కోహినూర్ వజ్ర అలంకరణ ఆమె మరణించిన దాకా కొనసాగింది. దౌత్య పరంగా సున్నితమైన అంశాల కారణంగా రాణి కెమిల్లా కోహినూర్ కు దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నారు.
బ్రిటన్ రాజు పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని వినియోగిస్తే భారత్ తో దౌత్య పరమైన సమస్యలు తలెత్తవచ్చని బ్రిటన్ లో ఇప్పటికే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. కోహినూర్ ను తిరిగి ఇచ్చేయ్యాలని భారత ప్రభుత్వం పలు మార్లు బ్రిటన్ ను కోరింది. ఈ పరిణామాలతో రాజ కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







