గురక ఎందుకొస్తుంది.? ఏం చేయాలి.?
- February 16, 2023
గురక అనేది చాలా సాధారణమైన సమస్య. కానీ, కొన్ని సమయాల్లో ఇది తీవ్రమైన సమస్యగానూ పరిణమిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో గురకను తీవ్రమైన సమస్యగానే పరిగణిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకమైన వైద్య చికిత్సలు సైతం అందుబాటులో వుంటున్నాయ్.
అయితే, తాత్కాలికంగా గురక నుంచి విముక్తి పొందడానికి కొన్ని వంటింటి చిట్కాలున్నాయ్ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లంలో జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలుంటాయ్. అలసటను దూరం చేయడానికి ఇవి తోడ్పడతాయ్. గురక బాగా ఎక్కువగా వస్తున్న వాళ్లు రాత్రి పడుకునే ముందు అల్లం టీ తాగితే మంచిది.
పసుపులో అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. మూసుకుపోయిన ముక్కును క్లియర్ చేయడంలో పసుపు తోడ్పడుతుంది. ముక్కు మూసుకుపోవడం గురకకు ప్రధానమైన కారణాల్లో ఒకటి. అందుకే రాత్రి పూట పసుపు కలిపిన పాలు తాగడం మంచిది.
అలాగే, పడుకునే ముందు కాస్త తేనె నాలుకకు రాసుకోవడం వల్ల ఉపశమనం వుంటుందట.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







