గురువారం నుంచి శనివారందాకా ఉచిత పార్కింగ్‌

- May 02, 2016 , by Maagulf
గురువారం నుంచి శనివారందాకా ఉచిత పార్కింగ్‌

రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) దుబాయ్‌ వ్యాప్తంగా పార్కింగ్‌ని గురువారం నుంచి శనివారం దాకా ఉచితం అని ప్రకటించింది. ఇస్రా మరియు మిరాజ్‌ హాలిడే సందర్భంగా అన్ని సేవలూ నిలిచిపోతాయని తిరి మే 8 ఆదివారం నుంచి యధాతథంగా సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. అయితే మల్టీ లెవల్‌ పార్కింగ్‌ లాట్స్‌ మరియు ఫిష్‌ మార్కెట్‌ పార్కింగ్‌ ఏరియాల్లో మాత్రం ఈ ఉచితానికి మినహాయింపు ఉందని అధికారులు పేర్కొన్నారు. పెయిడ్‌ పార్కింగ్‌ సర్వీసులు శనివారం మే 7 నుంచి తిరిగి యాక్టివేట్‌ అవుతాయని ఆర్‌టిఏ కార్పొరేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సపోర్ట్‌ సెక్టార్‌ సీఈఓ యూసఫ్‌ అల్‌ రెడా చెప్పారు. మెట్రో గ్రీన్‌ లైన్‌ స్టేషన్స్‌, మెట్రో రెడ్‌ లైన్‌ స్టేషన్స్‌, దుబాయ్‌ ట్రామ్‌, పబ్లిక్‌ బస్‌ సర్వీస్‌, మెట్రో ఫీడర్‌ బస్‌ స్టేషన్స్‌, మెరైన ట్రాన్సిట్‌ వంటి సేవలకు సంబంధించి కూడా ఈ రోజుల్లో పలు మార్పులుంటాయి. శుక్ర, శని వారాల్లో ఆయా సర్వీసుల పనివేళల్ని కుదించారు. ప్లాటినం సెంటర్‌, తస్జీల్‌ ఎట్‌ బర్షా సెంటర్‌, తస్జీల్‌ ఎట్‌ అల్‌ ఖాసిస్‌ సెంటర్స్‌ తప్ప తమ స్ట్రాటజిక్‌ పార్టనర్స్‌ అన్నీ ఇస్రా, మిరాజ్‌ హాలిడే సందర్భంగా మూసివేయబడ్తాయని ఆర్‌టిఏ కార్పొరేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సపోర్ట్‌ సర్వీస్‌ సెక్టార్‌ సీఈఓ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com