రెండు బాషలలో తిరుగులేని బ్రహ్మానందం..
- May 03, 2016
తెలుగు సినిమా చరిత్ర లో బ్రహ్మానందం కి ఉన్న క్రేజ్ , లెక్క , డిమాండ్ పూర్తిగా వేరు. ఆయన తమ సినిమాలో ఒక్క సీన్ లో అయినా కనపడాలి అని హీరోల దగ్గర నుంచి డైరెక్టర్ - ప్రొడ్యూసర్ వరకూ అందరూ కోరుకోవడం సహజమైన విషయమే. పారితోషికం అంతకంత కూ పెంచుకుంటూ పోయినా బ్రహ్మానందం లేని సినిమా ఈ మధ్య కాలం లో లేదు అంటే అర్ధం చేసుకోవచ్చు. అయితే బ్రాహ్మీ సినిమా విషయం లో ఇప్పుడు కొత్త కథ నడుస్తోంది. బ్రహ్మానందం తమిళ - తెలుగు సినిమాలలో ఎక్కువగా కనిపిస్తున్నారు. విక్రం , విశాల్ తీసే ద్విభాషా చిత్రాలల్లో బ్రహ్మానందం కి భారీ ప్రాధాన్యత కనిపిస్తోంది. ఈ ద్విభాషా చిత్రాల వలనా, డబ్బింగ్ సినిమాల వలనా బ్రహ్మానందం రెండు బాషలలో విపరీతమైన క్రేజ్ ని తెచ్చేసుకున్నాడు కూడా.తమిళ జనాలకి తెలుగు కమెడియన్ గా తెలిసిన బ్రాహ్మీ ఈ మధ్య కాలం లో అక్కడ చాలా మంచి పాత్రలు చేస్తూ జనాలకి దగ్గర కూడా అయ్య్యాడు. సైజు జీరో సినిమా అటు తెలుగు ఇటు తమిళం లో రెండింటా విడుదల అయినప్పుడు రెండు చోట్లా బ్రాహ్మీ నే మెయిన్ కమెడియన్ గా తీసుకోవడం తెలిసిందే. అలాగే ఇప్పుడు కమల్ హాసన్ చేస్తున్న నాయుడు సినిమాకి కూడా బ్రాహ్మీ రెండు బాషలలో కమల్ తో కలిసి విలన్ గా నటిస్తున్నాడు. ఈ రెండూ కాకుండా హిందీ లో కూడా ఈ సినిమా రాబోతోంది. బ్రాహ్మీ రేంజ్ లో పెద్ద , సీనియర్, టాలెంట్ ఉన్న కమీడియన్ తమిళం లో లేకపోవడం వలనే బ్రాహ్మీ కి అంత డిమాండ్ అంటున్నారు అక్కడ.
తాజా వార్తలు
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం







