మజిద్ అల్ ఫత్తైమ్ పెట్టుబడులతో 42,000 ఉద్యోగాలు
- May 03, 2016
ఒమన్‌లో మజిద్ అల్ ఫత్తైమ్ 15 మిలియన్ ఒమన్ రియాల్స్ పెట్టుబడితో 2020 నాటికి 42000 ఉద్యోగాలు రానున్నాయి. మజిద్ అల్ పత్తైమ్ - హోల్డింగ్ సీఈఓ అలైన్ బెజ్జాని మాట్లాడుతూ, రానున్న ఐదేళ్ళలో కంపెనీ పెట్టుబడుల ద్వారా 16,973 ప్రత్యక్ష ఉద్యోగాలు, 25,459 పరోక్ష ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. మాల్ ఆఫ్ ఒమన్ అభివృద్ధితో 29,000 డైరెక్ట్ జాబ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. మజిద్ అల్ ఫత్తైమ్కి చెందిన సిటీ సెంటర్ సోహార్ ప్రాజెక్ట్ నార్త్ బతినాలో అతి పెద్ద షాపింగ్ మరియు లైఫ్ స్టైల్ డెస్టినేషన్ కాబోతోంది. దీని ద్వారా 8,000 ఉద్యోగాలు వస్తాయి. మై సిటీ సెంటర్ సుర్, 3,500 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పించనుంది. కన్స్ట్రక్షన్ మరియు ఆపరేషన్ రంగంలో 190 మిలియన్ ఒమన్ రియాల్స్ పెట్టుబడులతో 23,000 ఉద్యోగాల్ని జనరేట్ చేయనుంది. మొత్తం ఉద్యోగాల సంఖ్య 65,579కి చేరబోతుందని బెజ్జాని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







