మండే ఎండల్లో రమదాన్ ఉపవాసం
- May 03, 2016
యూఏఈలో రమదాన్ ఉపవాసం అతి ఎక్కువ సమయం ఉండబోతున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ హెడ్ అష్రాఫ్ నౌరుల్ హక్ చెప్పారు. రమదాన్ మాసంలో సరాసరి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండనుంది. రంజాన్ మాసమంతా సగటున 15 గంటలు ప్రతిరోజూ ఉపవాసం ఉంటుందని ఆయన వివరించారు. రమదాన్ తొలి పది రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటాయనీ, రాత్రి వేళ వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని చెప్పారాయన. ఆ తర్వాతి పది రోజుల్లో 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. చివరిపది రోజుల్లో 44 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయనీ, తీవ్రమైన వడగాల్పులకు తోడు, ఇసుక తుఫాన్లు ఉంటాయని వెల్లడించారు. ఉపవాసం ప్రారంభించడానికి ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనీ, స్పైసీ ఫుడ్ తగ్గించి ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలని ఆయన సూచించారు. జూన్ 6 నుంచి ప్రారంభమయ్యే రమదాన్ జులై 5తో ముగుస్తుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







