విశ్వక్ సేన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడా.?
- February 20, 2023
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన సినిమాతో ఏదో మ్యాజిక్ చేస్తుంటాడు. సినిమా ప్రమోషన్లని విచిత్రంగా డిజైన్ చేసుకుంటాడు. అన్నీ కలిసొస్తే.. ఈ పాటికి మనోడు నటించిన ‘ధమ్కీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి వుండేది. ఫిబ్రవరి 17న ‘ధమ్కీ’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ, అనుకోకుండా వాయిదా పడింది.
దాంతో ఏప్రిల్‌కి పోస్ట్ పోన్ అయ్యింది ‘ధమ్కీ’. ఈ సినిమాని విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, నిర్మాణంలోనూ విశ్వక్ సేన్ భాగస్వామ్యం వుంది. ‘పాగల్’ కోసం విశ్వక్ సేన్‌తో జత కట్టిన నివేదా పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
కాగా, ఫిబ్రవరిలో సినిమా రిలీజై వుంటే, విశ్వక్ సేన్‌కి బాగా కలిసొచ్చేదని అంటున్నారు. ఫిబ్రవరిలో చెప్పుకోదగ్గ సినిమాలేమీ రిలీజ్ కాలేదు. సమంత ‘శాకుంతలం’ వాయిదా పడడం, ధనుష్ నటించిన ‘సార్’ డబ్బింగ్ చిత్రాల లిస్టులో పడడంతో డ్రై మంత్‌గా మిగిలిపోయింది. ఈ ఛాన్స్ విశ్వక్ సేన్ యూజ్ చేసుకుని వుంటే బాగుండేదని ఆయన అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







