‘కస్టడీ’ కోసం సమ్మర్‌ని లాక్ చేసిన నాగ చైతన్య.!
- February 20, 2023
అక్కినేని హీరో నాగ చైతన్య ఈ మధ్య వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి అత్యంత యాక్టివ్‌గా వున్న హీరోగా చైతూను చెప్పుకోవచ్చు. గతేడాది ‘లవ్ స్టోరీ’ , ‘బంగార్రాజు’, ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలతో సందడి చేశాడు.
ఈ ఏడాది ‘కస్టడీ’ సినిమాని సిద్ధం చేస్తున్నాడు. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ రూపొందుతోంది. మాస్ మసాలా యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీగా ‘కస్టడీ’ని బైలింగ్వల్ చిత్రంగా రూపొందిస్తున్నాడు వెంకట్ ప్రభు.
కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటూ, ఇంతవరకూ రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయ్. ప్రస్తుతం పాటల చిత్రీకరణలో బిజీగా వున్న ఈ చిత్రాన్ని మే 12న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి, సమ్మర్ నాగ చైతన్యకు ఎలా కలిసొస్తుందో.!
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







