ఖతార్ - యూఏఈ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం
- May 03, 2016
ఖతార్ - యూఏఈ పలు అంశాలపై ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల మధ్యా వివిధ విభాగాల్లో సహాయ సహకారాలు పరస్పరం అందించుకునేందుకు ఈ ఒప్పందాలు మార్గం సుగమం చేస్తున్నాయి. ఖతార్ ఫారిన్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థని మరియు యూఏఈ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ షేక్ అబ్దుల్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇంకో వైపున ఖతార్ డెవలప్మెంట్ బ్యాంక్ మరియు దుబాయ్ ఎక్స్పోర్ట్ కలిసి ఎంఓయూపై సంతకాలు చేశాయి. క్యుడిబి సీఈఓ అబ్దుల్ అజీజ్ బిన్ నాజర్ అల్ ఖలీఫా, దుబాయ్ ఎక్స్పోర్ట్ సయీద్ అవాది ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్యా ట్రేడ్ బ్యాలెన్స్ 6 నుంచి 7 బిలియన్లకు చేరుకుందని యూఏఈ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ వెల్లడించారు. ఖతార్‌లో 1,074 కంపెనీలు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. యూఏఈలో పనిచేస్తున్న ఖతారీ కంపెనీల సంఖ్య 4,200. ఇరు దేశాల మధ్యా వ్యూహాత్మక సంబంధాలు ఇంకా మెరుగుపడవలసి ఉందని ఇరువురూ అభిప్రాయపడ్డారు. ఖతార్‌లో పర్యటించే ఎమిరేట్ విజిటర్స్ సంఖ్య 117,000 కాగా, యూఏఈలో పర్యటించే ఖతారీ విజిటర్స్ సంఖ్య 231,000.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







