దేశంలోకెల్లా అతి పెద్ద, ఎత్తైన జాతీయ పతాకం: కేసీఆర్
- May 03, 2016
దేశంలోకెల్లా అతి పెద్ద, ఎత్తైన జాతీయ పతాకాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఘాట్ వద్ద ఈ పతాకాన్ని ఎగురవేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆయన ఆదేశించారు. 301 అడుగుల ఎత్తులో ఈ పతాకం ఉండాలని, అందుకనుగుణంగా పోల్ ఏర్పాటు చేయాలని చెప్పారు.ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచిలో 293 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఉంది. అంతకంటే ఎత్తయిన పోల్, అంతకంటే పెద్ద జెండా తెలంగాణలో ఎగుర వేయాలని అన్నారు. పౌరుల్లో జాతీయ భావనను పెంచడానికి ఈ చర్య దోహదపడుతుందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







