శుభవార్త.. ఫిబ్రవరి 25 నుండి ఓవర్‌స్టే జరిమానాలు, పర్మిట్‌ల క్రమబద్ధీకరణ

- February 24, 2023 , by Maagulf
శుభవార్త.. ఫిబ్రవరి 25 నుండి ఓవర్‌స్టే జరిమానాలు, పర్మిట్‌ల క్రమబద్ధీకరణ

యూఏఈ: వీసా సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ (GDRFA) గుడ్ న్యూస్ చెప్పింది. వీసా సమస్యలు ఉన్న నివాసితులు, సందర్శకులు, పర్యాటకుల కోసం దీరా సిటీ సెంటర్‌లో 'అందరికీ హోమ్‌ల్యాండ్' పేరుతో 3-రోజుల క్యాంపెయిన్ ను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 25 నుండి 27 వరకు ప్రతిరోజూ నిర్వహించే ఈ క్యాంపెయిన్ లో పలు వీసా సమస్యలను పరిష్కరించనున్నారు. వీసా గడువు ముగిసిన వారు, వీసా అనుమతి కంటే ఎక్కువ కాలం గడిపిన వారితో సహా వీసాలో ఏవైనా సమస్యలు ఉన్నవారికి సహాయం చేయడానికి సెంటర్‌పాయింట్‌కు సమీపంలోని డెయిరా సిటీ సెంటర్‌లోని ఏర్పాటు చేసిన స్టాల్‌లో ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు GDRFA అధికారులు అందుబాటులో ఉంటారు. వీసా సమస్యలున్న వారు స్టాల్ వద్దకు రావాలని GDRFAలోని క్లయింట్ హ్యాపీనెస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సలేం బిన్ అలీ సూచించారు.  యూఏఈలో అనుమతించబడిన వీసా వ్యవధి కంటే ఎక్కువ కాలం గడిపినందుకు రోజుకు Dh50 జరిమానా విధించబడుతుంది. దాంతోపాటు వీసా రద్దుకు కూడా దారితీసే అవకాశం ఉంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com