ఫిబ్రవరి 25న ఉచిత పార్కింగ్, షటిల్ బస్ సర్వీస్

- February 25, 2023 , by Maagulf
ఫిబ్రవరి 25న ఉచిత పార్కింగ్, షటిల్ బస్ సర్వీస్

దుబాయ్: ఫిబ్రవరి 25న సూపర్ కప్ 2023ని చూడాలని ప్లాన్ చేస్తున్న నివాసితులు, సందర్శకుల కోసం ఉచిత షటిల్ బస్ సర్వీసును అందిస్తున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. అలాగే  ఫుట్‌బాల్ అభిమానులకు ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలాలను కూడా కల్పించినట్లు పేర్కొంది. అల్ బూమ్ టూరిస్ట్ విలేజ్, అల్ వాస్ల్ స్పోర్ట్స్ క్లబ్‌లోని నిర్దేశిత స్లాట్లలో ప్రజలు తమ కార్లను పార్క్ చేసి, ఆపై సూపర్ కప్ వేదిక అల్ మక్తూమ్ స్టేడియం (అల్ నాస్ర్ క్లబ్)కి ఉచిత షటిల్‌ బస్ సర్వీస్ లో ప్రయాణించవచ్చని ఆర్టీఏ తన ట్వీట్‌లో చెప్పింది.  ఈ టోర్నీ రాత్రి 8.30 నుంచి 11 గంటల వరకు జరగనుంది. ఈ సందర్భంగా సూపర్ కప్ 2023 వేదిక మ్యాప్‌ను షేర్ చేసింది. ఇందులో పార్కింగ్ స్పాట్‌లు, పిక్-అండ్-డ్రాప్ స్థానాలను తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com