అజయ్ దేవ్ గన్ పనామా పేపర్లలో ..
- May 04, 2016
ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన మోసాక్ ఫోనెస్కాకు చెందిన పనామా పేపర్స్ తాజాగా మరో బాలీవుడ్ నటుడి వ్యవహారం బయటపెట్టాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ బ్రిటన్ లోని వర్జిన్ ఐలాండ్ కు చెందిన మేరిలిబోన్ ఎంటర్ టైన్ మెంట్ అనే సంస్థలో దాదాపు వెయ్యి షేర్లు కొనుగోలు చేశారని పనామా బయటపెట్టింది.అజయ్ తన కంపెనీ నిసా యుగ్ ఎంటర్ టైన్ మెంట్ పేరిట ఈ షేర్లు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ కంపెనీలో ఆయన భార్య కాజల్ కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ కంపెనీకి అజయ్ 2013లో డైరెక్టర్ గా ఉండి.. 2014లో రాజీనామా చేశారు. పనామా బయటపెట్టిన వివరాలపై ఆయన స్పందిస్తూ.. తాను ఆర్బీఐ మార్గదర్శకాలు పాటించే విదేశాల్లోని ఆ కంపెనీలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టానని చెప్పారు. చట్ట ప్రకారం చేయాల్సిన ట్యాక్స్ రిటర్న్స్ కూడా చేశామని, వాటి వివరాలు తన కుటుంబం ఇప్పటికే తెలియజేసిందని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







