యూఏఈలో ఈ 70 దేశాల పౌరులకు ఆన్ అరైవల్ వీసా
- February 25, 2023
యూఏఈ: ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా యూఏఈ ఉంది. ముఖ్యంగా దుబాయ్ కి అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాల నుండి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే, ప్రతి జాతీయతకు వేర్వేరు వీసా నియమాలు వర్తిస్తాయి. వారిలో కొందరికి వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉండగా.. మరికొందరు యూఏఈకి వచ్చేందుకు ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 70 దేశాల పౌరులకు యూఏఈకి రాగానే వీసా అందజేస్తారు. ఇతర జాతీయులు మాత్రం వారు బయలుదేరే ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
30 రోజుల వీసా
ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్,ఎతిహాద్ ఎయిర్‌వేస్ వెబ్‌సైట్‌ల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా.. దాదాపు 20 దేశాలు లేదా భూభాగాల పాస్‌పోర్ట్ హోల్డర్లు 30 రోజుల వీసా ఆన్ అరైవల్ ఉచితంగా పొందుతారు. వారు: అండోరా, ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, చైనా, హాంకాంగ్ (చైనా), జపాన్, కజకిస్తాన్, మకావు (చైనా), మలేషియా, మారిషస్, మొనాకో, న్యూజిలాండ్, ఐర్లాండ్, శాన్ మారినో, సింగపూర్, ఉక్రెయిన్, యూకే మరియు ఉత్తర ఐర్లాండ్, యూఎస్ఏ, వాటికన్ నగరం.
90 రోజుల వీసా
50 కంటే ఎక్కువ దేశాలు లేదా భూభాగాల జాతీయులకు 90-రోజుల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా జారీ చేయబడుతుంది. ఈ వీసా జారీ చేసిన తేదీ నుండి ఆరు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. వీసా హోల్డర్లు మొత్తం 90 రోజుల పాటు యూఏఈలో ఉండవచ్చు. ఆ దేశాలు: అర్జెంటీనా, ఆస్ట్రియా, బహామాస్ దీవులు, బార్బడోస్, బెల్జియం, బ్రెజిల్, బల్గేరియా, చిలీ, కొలంబియా, కోస్టా రికా, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎల్ సల్వడార్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హోండురాస్, హంగేరి, ఐస్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, కిరిబాటి, లాట్వియా, లిచెన్‌స్టెయిన్, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్దీవులు, మాల్టా, మోంటెనెగ్రో, నౌరు, నెదర్లాండ్స్, నార్వే, పరాగ్వే, పెరూ, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, రష్యా, సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్, శాన్ మారినో, సెర్బియా, సీషెల్స్, స్లోవేకియా, సోలమన్ దీవులు, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఉరుగ్వే.
180 రోజుల వీసా
మెక్సికన్ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్న ప్రయాణికులు మల్టిపుల్ ఎంట్రీ 180-రోజుల సందర్శన వీసాకు అర్హులు. ఇది జారీ చేసిన తేదీ నుండి ఆరు నెలల పాటు చెల్లుబాటు అవుతుంది.
మందుగానే వీసాకు దరఖాస్తు
ఆసియా, ఆఫ్రికా నుండి అన్ని ఇతర దేశాల జాతీయులు వారి ప్రయాణానికి ముందే యూఏఈ వీసాను కలిగి ఉండాలి.
కాగా, యూఎస్ఏ జారీ చేసిన విజిట్ వీసా లేదా గ్రీన్ కార్డ్ కలిగి ఉన్న భారతీయ పౌరులు.. యూకే, ఈయూ రెసిడెన్సీ కలిగి ఉన్నవారు.. నిర్దిష్ట కాలానికి గరిష్టంగా 14 రోజుల పాటు ఉండేందుకు వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు. నిర్దిష్ట రుసుముతో అదనంగా 14 రోజులు దీనిని పొడిగించుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్‌ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్‌పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్‌ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







