‘ఆర్ఆర్ఆర్’కి క్యూ కడుతున్న హాలీవుడ్ అవార్డులు.!

- February 25, 2023 , by Maagulf
‘ఆర్ఆర్ఆర్’కి క్యూ కడుతున్న హాలీవుడ్ అవార్డులు.!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. రిలీజై దాదాపు సంవత్సరం కావస్తున్నా.. ఈ సినిమా మేనియా తగ్గడం లేదు. సరికదా.. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పోటెత్తుతున్నాయ్. 
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఇటీవలే ‘నాటు నాటు..’ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే, ఆస్కార్ నామినేషన్లలోనూ చోటు దక్కించుకుంది ఈ పాట. మార్చి 13న ఫైనల్ రిజల్ట్ తెలియనుంది. 
ఇదిలా వుంటే, తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ ఖాతాలో మరో అవార్డు దక్కించుకుంది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే రామ్ చరణ్ బాణాల సన్నివేశాలు తమను ఎంతగానో ఇంప్రెస్ చేశాయని హాలీవుడ్ ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ వ్యాఖ్యానించడం విశేషం. 
ఇలా అంతర్జాతీయ వేదికలపై ‘ఆర్ఆర్ఆర్’ పేరు మార్మోగిపోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ కేవలం సినిమా కాదు.. తెలుగు సినిమా గౌరవం. తెలుగు సినిమా ఖ్యాతి. తెలుగు సినిమా వైభవం.. ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com