మీ పిల్లల బంగారు భవిష్యత్ కు ‘హైగేట్ స్కూల్’ భరోసా
- February 26, 2023
దుబాయ్: దుబాయ్ అల్ బార్షా సౌత్ లోని అర్జన్ ఏరియాలో ఉన్న హైగేట్ ఇంటర్నేషనల్ స్కూల్.. ఇప్పుడున్న స్కూళ్లన్నింటి కంటే భిన్నమైన రీతిలో అనుభవం, ఆవిష్కరణలను మేళవించే అద్భుతమైన వేదికగా పేరుగాంచింది.ప్రపంచ స్థాయి విద్యలో మెరుగైన ట్రాక్ రికార్డ్‌తో, పిల్లలకు అత్యుత్తమ అభ్యాస అనుభవానికి హామీ ఇస్తున్నట్లు స్కూల్ CEO గురుస్వామి కల్లూర్ తెలిపారు.
గ్రేడ్ 7వరకు బోధించే ఈ స్కూళ్లో క్లాస్ రూమ్ బోధన కంటే ప్రాక్టికల్స్, ప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంక్లిష్టమైన విషయాలను చేధించడం, కొత్త ఆవిష్కరణల దిశగా ప్రయోగాలు, వ్యూహాత్మక ఆలోచన విధానం, క్రియేటివ్ యాక్టివిటీస్‌ను విద్యార్థులకు అలవరుస్తారు. ఎలాంటి విద్యార్థి అయిన విభిన్న సబ్జెక్టుల్లో టాలెంట్ సాధించేలా తర్పీదు నిచ్చే అత్యుత్తమ అనుభవం ఉన్న ఫ్యాకల్టీ ‘హైగేట్ స్కూల్’ సొంతమని CEO వెల్లడించారు.
అన్నిరకాల మౌలిక వసతులతో ప్రారంభమైన ఈ పాఠశాల.. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఆదర్శంగా మారుతోంది.దుబాయ్ లోని అన్ని పాఠశాలలకంటే మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్న స్కూల్ గా రూపుదిద్దుకుంది.ప్రతి క్లాస్ రూంలో విద్యార్థుల అభ్యసన అనుభవాన్ని పెంచేలా క్లాస్ రూం పరిసరాలను తీర్చిదిద్దారు.పాఠశాలలో విద్యార్థులకు అత్యున్నత ప్రమాణ శ్రేణిలో సకల సౌకర్యాలు కల్పించినట్లు గురుస్వామి తెలిపారు.
ఆర్వో ప్లాంట్, పరిశుభ్రమైన వాతావరణం,డిజిటల్ పాఠాలు, సహపాఠ్య కార్యక్రమాలు వంటి మరిన్ని ప్రత్యేకతలు ఈ పాఠశాల సొంతమని పేర్కొన్నారు.స్కూల్ గోడలు, తరగతి గదులపై సృజనాత్మక చిత్రాలు..చక్కటి సృజనాత్మక చిత్రాలు ఎన్నో విద్యార్థుల్లో సానుకూల ఆలోచనలను పెంచుతాయని స్కూల్ CEO గురుస్వామి చెప్పారు. గ్రేడ్ వన్ నుంచి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు, ఆసక్తి గలవారు వర్కింగ్ అవర్స్ లో స్కూల్ అడ్మిన్ విభాగాన్ని సందర్శించాలని కోరారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







