రేపటి నుండి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్న మహేష్–త్రివిక్రమ్
- February 26, 2023
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ లకలయికలో SSMB28 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి కాగా రేపు సోమవారం నుండి కొత్త షెడ్యూల్ మొదలుకాబోతుంది. పూజా హగ్దే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా , సెకండ్ హీరోయిన్ గా ధమాకా బ్యూటీ శ్రీ లీల నటిస్తుంది. రేపు మొదలుకానున్న షెడ్యూల్ లో శ్రీ లీల పాల్గొననుంది. ఇటీవలే మహేశ్ బాబు ఫారెన్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని రావడంతో ఈ చిత్రం తాజా షెడ్యూల్ కు రూపకల్పన చేశారు.
గతంలో మహేష్ – త్రివిక్రమ్ కలయికలో అతడు , ఖలేజా చిత్రాలు వచ్చి ప్రేక్షకులను అలరించగా..ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ రాబోతుండడం తో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని నాగ వంశీ నిర్మిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో పాటు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ – సముద్ర ఖని కలయికలో తెరకెక్కుతున్న మూవీ కి స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ ప్రారంభం జరిగింది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







