అల్ బర్షాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
- February 26, 2023
దుబాయ్: అల్ బర్షాలోని ఓ అపార్ట్మెంట్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన అధికారులు రెండు గంటల వ్యవధిలోనే మంటలను అదుపు చేశారు. అల్ బర్షా ప్రాంతంలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్లు ఉదయం 9.35 గంటలకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్స్ రూమ్‌కు సమాచారం అందిందని అల్ బార్షా అగ్నిమాపక కేంద్రం ప్రకటించింది. వెంటనే ప్రత్యేక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఉదయం 10.20 గంటల వరకు మంటలను ఆర్పివేసినట్లు ఫీల్డ్ కమాండర్ తెలిపారు. ఉదయం 11.57 గంటలకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, ఈ ప్రమాదంలో ఎవరికి గాయపడలేదని ఫీల్డ్ కమాండర్ తెలిపారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







