పడవ మునిగి 34 మంది మృతి
- February 26, 2023
ఇటలీ: ఇటలీ తీరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వంద మంది శరణార్థులతో వస్తున్న పడవ మునిగి దాదాపు 34 మంది మృతి చెందారు. పడవలో మొత్తం 100 మందికి పైగా శరణార్థులు ఉన్నట్టు ఇటలీ కోస్ట్ గార్డ్ అధికారులు భావిస్తున్నారు. వారంతా ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ కు చెందినవారిగా గుర్తించారు. కోట్రోన్ ప్రావిన్స్ లోని కలాబ్రియా గ్రామం వద్ద తీరానికి మృతదేహాలు కొట్టుకొని వచ్చాయి.
అలల ఉద్ధృతికి సముద్రంలోని బండరాళ్లను బోటు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బోటు మధ్యకు విరిగిపోవడంతో శరణార్థులు నీటిలో మునిగిపోయారు. సొంతదేశంలో పొట్ట గడవక, కల్లోల భరిత పరిస్థితుల్లో జీవించలేక ఇతర దేశాలకు వలస వెళదామనుకునే శరణార్థులు అనేక సందర్భాల్లో సముద్ర ప్రమాదాలకు గురి అవుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే జరిగింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







