అనేక విమానాలను రద్దు చేసిన ఎమిరేట్స్
- February 27, 2023
యూఏఈ: కార్మికులు వేతనాల కోసం చేపట్టిన సమ్మె కారణంగా దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఫిబ్రవరి 27న అనేక విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డ్యూసెల్డార్ఫ్ విమానాశ్రయంలో ప్రకటించిన సార్వత్రిక సమ్మె కారణంగా ఫిబ్రవరి 27న దుబాయ్ -డ్యూసెల్డార్ఫ్ మధ్య పలు విమానాలు రద్దు చేసినట్లు ఎమిరేట్స్ తెలిపింది. రద్దయిన విమానాల్లో EK055: దుబాయ్ నుండి డ్యూసెల్డార్ఫ్, EK056: డ్యూసెల్డార్ఫ్ నుండి దుబాయ్, EK057 : దుబాయ్ నుండి డ్యూసెల్డార్ఫ్, EK058 : డ్యూసెల్డార్ఫ్ నుండి దుబాయ్ ఉన్నాయి.
జర్మనీలోని వెర్డి లేబర్ యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 27న కొలోన్ బాన్ (CGN), డ్యూసెల్డార్ఫ్ (DUS) విమానాశ్రయాల వద్ద సమ్మె చేయాలని యోచిస్తున్నారు. సమ్మె ఫిబ్రవరి 26-27 రాత్రిపూట ప్రారంభమై.. ఫిబ్రవరి 27-28 రాత్రిపూట ముగియనుంది. సమ్మె కారణంగా ప్రభావిత విమానాశ్రయాలలో ప్రాసెసింగ్ ఆలస్యం, రద్దుతో సహా విమాన అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసిన ఎమిరేట్స్.. బాధిత ప్రయాణికులు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారం కోసం ట్రావెల్ ఏజెంట్లు, ఎమిరేట్స్ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







