మార్చి 9న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ గార్డెన్ షో 2023

- February 27, 2023 , by Maagulf
మార్చి 9న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ గార్డెన్ షో 2023

బహ్రెయిన్: అరేబియా గల్ఫ్‌లోని ప్రముఖ గార్డెనింగ్, వ్యవసాయ ప్రదర్శన అయిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ గార్డెన్ షో (BIGS) 2023 ఎడిషన్ మార్చి 9న జరుగనుంది.  హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఈవెంట్ ను హర్ రాయల్ హైనెస్ ప్రిన్సెస్ సబీకా బింట్ ఇబ్రహీం అల్ ప్రారంభించనున్నారు. సఖిర్‌లోని ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లోని అంతర్జాతీయ ప్రదర్శన మార్చి 9న మధ్యాహ్నం 1 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, మార్చి 10 నుండి 12వ తేదీ వరకు ఉదయం 10 నుండి రాత్రి 9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని NIAD సెక్రటరీ-జనరల్ షైఖా మరమ్ బింట్ ఇసా అల్ ఖలీఫా తెలిపారు. ఈ సంవత్సరం BIGS 'వాటర్: రీజనరేటింగ్ లైఫ్" అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. అలాగే వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి అధ్యయనాలు నిర్వహించిన పలు ప్రముఖ సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి.  176 కంటే ఎక్కువ మంది ఎగ్జిబిటర్లు తమ డిజైన్‌లు, ఉత్పత్తులు, సాంకేతికతలు, ఆవిష్కరణలతో BIGS 2023లో పాల్గొంటారని భావిస్తున్నారు. మరిన్ని వివరాలకు www.bigs.com.bh[email protected] లేదా 32111603, 17171603లో సంప్రదించాలని కోరారు. 

 
 
 
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com