మార్చి 2న స్పేస్ఎక్స్ క్రూ-6 ప్రయోగం
- February 27, 2023
యూఏఈ: సోమవారం గ్రౌండ్ సిస్టమ్ లో ఏర్పడ్డ సమస్య కారణంగా కౌంట్‌డౌన్ చివరి నిమిషాల్లో స్పేస్ఎక్స్ క్రూ-6 ప్రయోగాన్ని నాసా నిలిపివేసింది. ఈ మేరకు నాసా ట్విట్టర్లో తెలిపింది. “నేటి క్రూ6 లాంచ్ గ్రౌండ్ సిస్టమ్‌లతో సమస్య కారణంగా స్క్రబ్ చేయబడింది.’’ అని ట్వీట్ లో వెల్లడించింది. ఫాల్కన్ 9 మొదటి దశ మెర్లిన్ ఇంజిన్లు, ట్రైఎథైల్యూమినియం ట్రైథైల్బోరాన్ (లేదా TEA-TEB) పూర్తి లోడ్‌ను నిర్ధారించే డేటాను మిషన్ బృందాలు విశ్లేషించే పనిలో ఉన్నారు. కాగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రయోగ రిజర్వ్ డే అయిన ఫిబ్రవరి 28ని నాసా, స్పేస్ ఎక్స్ రద్దుచేశాయి. అందుబాటులో ఉన్న తదుపరి ప్రయోగ తేదీ అయిన మార్చి 2న(సోమవారం) 12:34 a.m. EST ప్రయోగం చేపడతామని తెలిపారు.
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మాట్లాడుతూ “ప్రయోగం వాయిదా పడింది. అయినప్పటికీ మా ఆశయాలు ఉన్నతంగానే ఉన్నాయి. ఎమిరాటీ వ్యోమగామి @Astro_Alneyadi అండ్ మొత్తం క్రూ-6 బృందానికి సురక్షితమైన, విజయవంతమైన మిషన్ కావాలని కోరుకుంటున్నాను. #జాయేద్ ఆశయం." అని తన ట్వీట్ లో ఆకాంక్షించారు.
స్పేస్ఎక్స్ డ్రాగన్ క్రూ-6 మిషన్ యూఏఈ కాలమానం ప్రకారం ఉదయం 10:45 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి బయలుదేరాల్సి ఉంది. కానీ లిఫ్ట్-ఆఫ్‌కి కేవలం రెండు నిమిషాల ముందు సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని నిలిపివేశారు. ఈ ప్రయోగం ద్వారా నాసాకు చెందిన స్టీఫెన్ బోవెన్, వారెన్ హోబర్గ్, రష్యాకు చెందిన ఆండ్రీ ఫెడ్యావ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన సుల్తాన్ అల్-నెయాడి అంతర్జాతీయ కక్ష్య స్టేషన్లో ఆరు నెలలు గడపనున్నారు.
తాజా వార్తలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన







