మొదటి దశలోనే 90% సీవీలు ఎందుకు తిరస్కరించబడతాయి?

- February 27, 2023 , by Maagulf
మొదటి దశలోనే 90% సీవీలు ఎందుకు తిరస్కరించబడతాయి?

యూఏఈ: ఉద్యోగార్ధుల దరఖాస్తుల్లో దాదాపు 90 శాతం వరకు మొదటి దశలోనే తిరస్కరణకు గురవుతున్నాయి. వివిధ కారణాల వల్ల సీవీలు నియామక నిర్వాహకుడిని కూడా చేరుకోవడం లేదు. రిక్రూట్‌మెంట్, హెచ్‌ఆర్ కన్సల్టెంట్‌ల ప్రకారం.. యూఏఈలోని పెద్ద కంపెనీలు కాబోయే అభ్యర్థుల నుండి ప్రతిరోజూ వేలాది CVలను స్వీకరిస్తుంటాయి. వాటిని పరిశీలించేందుకు కృత్రిమ మేధస్సు (AI) వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రమాణాలకు అనుగుణంగా లేని అనేక సీవీలు తొలిదశలోనే తిరస్కరణకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

అడెక్కో మిడిల్ ఈస్ట్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ పటేల్ మాట్లాడుతూ.. AI సాధనాల ద్వారా చేపట్టే స్క్రీనింగ్ ప్రక్రియ వ్యక్తిగత ఎంపిక కంటే వారి నైపుణ్యాల ఆధారంగా అభ్యర్థులను జల్లెడ పడతాయని అన్నారు. ఉత్తమ అభ్యర్థులను నిమిషాల వ్యవధిలో నియామక నిర్వాహకుని దృష్టికి తీసుకువస్తామని తెలిపారు. ఒక నియామక నిర్వాహకుడు రోజుకు సుమారుగా 200 రెజ్యూమ్‌లను అందుకుంటారని, AI స్క్రీనింగ్ కారణంగా, సిస్టమ్ హైరింగ్ మేనేజర్ సెట్ చేసిన ప్రమాణాలను విశ్లేషిస్తుందని, తదుపరి రౌండ్ స్క్రీనింగ్ కోసం సంప్రదించడానికి దాదాపు 10 శాతం నుండి 20 శాతం అప్లికేషన్‌లను ఫిల్టర్ అవుతాయని పటేల్ చెప్పారు. 

అప్‌ఫ్రంట్ హెచ్‌ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ వలీద్ అన్వర్ మాట్లాడుతూ.. రిక్రూటర్లు వేలాది దరఖాస్తులను స్వీకరిస్తున్నారని, అందువల్ల ప్రతి దరఖాస్తును సమీక్షించడం చాలా కష్టమని చెప్పారు. సాధారణంగా, ప్రతి ఉద్యోగానికి 10 నుండి 20 శాతం మాత్రమే సంబంధిత నైపుణ్యాలు ఉన్నవారు దరఖాస్తు చేస్తారని పేర్కొన్నారు. అప్‌ఫ్రంట్ హెచ్‌ఆర్ ప్రకారం, అంతర్గత రిక్రూటర్, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ లేదా సాఫ్ట్‌వేర్/AI రూపంలో ఉద్యోగం కోసం సరైన దరఖాస్తులను ఎంచుకోవడానికి మెజారిటీ కంపెనీలు ఫిల్టర్‌లను అమలు చేస్తున్నాయి.

“ఈ రోజుల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం చాలా సులభం. అభ్యర్థులు పోటీని అధిగమించడానికి ప్రతి దరఖాస్తును ఉద్యోగానికి అనుకూలంగా మార్చడానికి సమయాన్ని వెచ్చించరు. వారు తమ CVకి కీలక పదాల రూపంలో మరింత సంబంధిత నైపుణ్యాలను జోడించవచ్చు. లేదా హైలైట్ చేయవచ్చు. తద్వారా సాఫ్ట్‌వేర్ లేదా రిక్రూటర్ వారిని ఎంచుకుంటారు. వారి CV షార్ట్‌లిస్ట్ చేయబడుతుంది. అభ్యర్థులు హైరింగ్ మేనేజర్ లేదా రిక్రూటర్ ఎవరో తెలుసుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి.’’ అని వలీద్ అన్వర్ తెలిపారు.

అభ్యర్థులు ఉద్యోగ ప్రకటనను చదవడానికి, అవసరమైన ప్రమాణాలకు సరిపోలకుండా దరఖాస్తు చేయడానికి సమయాన్ని వెచ్చించకపోవడమే రిక్రూటర్‌లకు అతిపెద్ద సమస్య అని అన్వర్ పేర్కొన్నారు. "దరఖాస్తుదారులు ప్రకటనను చదవడానికి సమయాన్ని వెచ్చించాలి. వారు కనీసం 70 నుండి 80 శాతం జాబ్ రిక్వైర్ మెంట్లు ఉన్నట్లు నిర్ధారించుకుని, ఆపై దరఖాస్తు చేసుకోవాలి." అని తెలిపారు.

వర్చువల్ ఇంటర్వ్యూలు, AI , ఆటోమేషన్ వినియోగం, రిమోట్ హైరింగ్, వర్కింగ్, టాలెంట్ డైవర్సిటీ, వీడియో ఇంటర్వ్యూలు మొదలైన కొత్త రిక్రూట్‌మెంట్ మార్గాలను పరిగణనలోకి తీసుకుంటే, అభ్యర్థులు “వ్యక్తిగత బ్రాండింగ్” పరంగా తమను తాము సిద్ధం చేసుకోవడం ఇప్పుడు మరింత ముఖ్యమైనదని మయాంక్ పటేల్ అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com