తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.!
- February 28, 2023వయసుతో సంబంధం లేకుండానే తెల్ల జుట్టు సమస్య వేధిస్తోంది ప్రస్తుత కాలంలో. ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి మార్కెట్లో లభ్యమయ్యే అనేక రకాల హెయిర్ డైస్ వాడకం విరివిగా పెరిగిపోయింది. తద్వారా హెయిర్ ఫాల్ సమస్యలు.. ఇతరత్రా సమస్యలు వెంటాడుతున్నాయ్.
నేచురల్ వేలో తెల్ల జుట్టును నివారించుకోవడమెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదం జుట్టుకు చాలా మేలు చేస్తుంది. జుట్టును సిల్కీగా చేయడానికే కాదు.. చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయ్.
ఆముదంలో విటమిన్ ఇ, మినరల్స్, ప్రొటీన్స్ అధికంగా వుంటాయ్. జుట్టును ఆరోగ్యంగా వుంచేందుకు ఇవి తోడ్పడతాయ్. అలాగే తెల్ల జుట్టు సమస్యను కూడా నివారిస్తుంది.
వారానికి నాలుగు సార్లు ఆముదం నూనెతో తలకు మర్దన చేస్తే ఫలితం వుంటుంది. జుట్టు పొడిబారిపోవడం.. నిర్జీవంగా మారిపోయి రాలిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయ్. తద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నల్లగా నిగనిగలాడుతుంది. తరచూ ఆముదంతో మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు కుదుళ్ల నుంచీ బలంగా పెరుగుతుంది.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం