ఒమన్‌లో 600 మందికి పైగా ప్రవాస కార్మికులు అరెస్ట్
- March 06, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో 600 మందికి పైగా ప్రవాస కార్మికులను అరెస్టు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కార్మిక మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఫిబ్రవరి 2023లో కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసుల సంఖ్య 626గా ఉంది. ఇందులో తమ స్పాన్సర్‌లను వదిలి ఇతరుల కోసం పనిచేస్తున్న 230 మంది ప్రవాసులు ఉన్నారు. 319 మంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టగా.. వారిలో 77 మంది ఇతర ఉల్లంఘనలకు పాల్పడ్డారు. మరోవైపు ఫిబ్రవరి 2023లో బహిష్కరించబడిన ప్రవాసుల సంఖ్య 391 మంది కార్మికులకు చేరుకుంది. ఇందులో 68 మంది తమ స్పాన్సర్‌లను విడిచిపెట్టి ఇతరుల కోసం పనిచేస్తున్నారు. 214 మంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు. వారిలో 109 మంది ఇతర ఉల్లంఘనలకు పాల్పడ్డారని కార్మిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







