బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ ఏర్పాట్లను పరిశీలించిన ప్రిన్స్ సల్మాన్
- March 07, 2023
బహ్రెయిన్: 2023 ఫార్ములా 1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ విజయం.. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లను నిర్వహించగల బహ్రెయిన్ సామర్థ్యానికి నిదర్శనం అని.. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అన్నారు. సోమవారం జరిగిన కార్యక్రమానికి హాజరైన క్రౌన్ ప్రిన్స్.. రేసు కోసం సన్నాహాలను సమీక్షించారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి) ట్రాక్‌లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట యూత్ అండ్ స్పోర్ట్స్ కోసం సుప్రీం కౌన్సిల్ మొదటి డిప్యూటీ చైర్మన్, జనరల్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా, ఇసా బిన్ సల్మాన్ ఛారిటీ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల చైర్మన్ హిస్ హైనెస్ షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!







