పాపం కార్తికేయ కష్టం ఈ సారైనా పలిస్తుందా.?
- March 07, 2023
విషయమున్న హీరో. ఎలాంటి రోల్స్ అయినా ఈజీగా చేసేయగల సత్తా వున్నోడు. కానీ, కాలం కలిసి రావడం లేదు. తొలి సినిమా ఇచ్చిన కిక్కు ఆ తర్వాత మళ్లీ కొట్టలేకపోయాడు. అదేనండీ ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ.
తాజాగా ‘బెదురులంక 2012’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కష్టపడుతున్నాడు. కానీ, కోరుకున్న సక్సెస్ దక్కడం లేదు. యుగాంతం నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా ఇది. కాన్సెప్ట్ పాతదే అయినా కొత్తగుంటుందంటున్నాడు.
ప్రచార చిత్రాలతో బజ్ బాగానే క్రియేట్ చేశాడు కానీ, హిట్ వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. మంచి విషయమున్న హీరోనే కానీ, కథల ఎంపికలోనే కాస్త తటపడుతున్నాడేమో అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయ్ కార్తికేయ మీద.
నేహా శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమా మార్చి 22 న రిలీజ్‌కి ముస్తాబవుతోంది. కార్తికేయ కెరీర్లోనే బెస్ట్ ప్రీ రిలీజ్ బిిజనెస్ ఈ సినిమాకి జరిగిందని అంటున్నారు. చూడాలి మరి, మనోడి లక్కు ఎలా వుండబోతోందో. అన్నట్లు తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వలిమై’ సినిమాలో కార్తికేయ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఆ స్థాయిలో నక్కతోక తొక్కినా మనోడి లక్కు మాత్రం అక్కడే ఆగిపోయింది.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









