ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6 తీవ్రత
- March 07, 2023
యూఏఈ: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో మంగళవారం 6.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మిండనావో ద్వీపంలోని దవావో డి ఓరో అనే పర్వత బంగారు గనుల ప్రావిన్స్‌లో మారగుసన్ మునిసిపాలిటీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో మధ్యాహ్నం 2:00 గంటలకు (0600 GMT) భూకంపం సంభవించింది. అయితే, ప్రాణనష్టం గురించి సమాచారం లేదని, జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడిన నివేదికలను అందాయని మారగుసన్ విపత్తు కార్యాలయంలోని ఉద్యోగి తెలిపారు. సాధారణంగా జపాన్ నుండి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్రమైన భూకంప, అగ్నిపర్వత కార్యకలాపాల ఆర్క్ అయిన పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" వెంబడి ఉన్న ఫిలిప్పీన్స్‌లో తరచుగా భూకంపాలు వస్తుంటాయి. ఉత్తర ఫిలిప్పీన్స్‌లో అక్టోబర్‌లో చివరిసారిగా భారీ భూకంపం సంభవించింది. 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం అబ్రా ప్రావిన్స్‌లోని పర్వత పట్టణం డోలోర్స్ లో అనేక మంది గాయపడగా.. పలు భవనాలు దెబ్బతిన్నాయి. గత జూలైలో పర్వత ప్రాంతాల అబ్రాలో 7.0-తీవ్రతతో సంభవించిన భూకంపంతో కొండచరియలు విరిగాపడ్డాయి. ఇందులో 11 మంది మరణించగా.. వందల మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









