యూఏఈలో ‘ప్రైవేట్ స్కూల్స్’గా 28 ప్రభుత్వ పాఠశాలలు!

- March 07, 2023 , by Maagulf
యూఏఈలో ‘ప్రైవేట్ స్కూల్స్’గా 28 ప్రభుత్వ పాఠశాలలు!

యూఏఈ: పిల్లల తల్లిదండ్రులకు మరిన్ని ఎంపికలను అందించేందుకు యూఏఈలోని 28 ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌గా మారనున్నాయి. అబుధాబిలో జరిగిన కేబినెట్ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సంబంధిత ప్రతిపాదనలను ఆమోదించారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ మాట్లాడుతూ.. తాము అల్-అజ్యల్ పాఠశాలల కోసం కార్యాచరణ నమూనాను స్వీకరించామని, దీని ద్వారా 28 ప్రభుత్వ పాఠశాలలను 3 సంవత్సరాల పాటు ప్రైవేట్ రంగం నుండి అనుభవజ్ఞులైన ఆపరేటర్లచే నిర్వహించేలా అవుట్‌సోర్స్ కు ఇచ్చినట్లు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com