టమోటా మాల్పురి
- May 05, 2016
కావలసిన పదార్థాలు: బెంగళూరు టమో టాలు-4, మైదాపిండి - ఒక కప్పు, బేకింగ్ పౌడర్- పావు టీ స్పూను, పాలు- ఒక టేబుల్ స్పూను, నెయ్యి- అర కప్పు, పచ్చికొబ్బరి కోరు - ఒక కప్పు, యాలకులపొడి- కొద్దిగా, పంచదార పొడి - రెండు టేబుల్ స్పూన్లు, కిస్మిస్లు, బాదంపలుకులు, జీడిపప్పు- కొద్దిగా
తయారీ విధానం: టమోటాలు వేడినీళ్ళలో వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత తొక్క తీసి పండుని మిక్సీలో వేసి రుబ్బుకుని గుజ్జు తీసుకోవాలి. ఇందులో మైదాపిండి వేసి బాగా కలపాలి. పాలు, బేకింగ్ పౌడర్, పంచదార కూడా వేసి పిండిని జారుగా కలపాలి. ఇప్పుడు ఒక నానస్టిక్ పెనం పొయ్యి మీద పెట్టి గరిటతో పిండిని దోసెల్లా పోయాలి. దాని మీద నెయ్యి వేసి ఒకవైపు కాలాక తిరగేసి మళ్ళీ నెయ్యి వేసి కాల్చాలి. ఇలా అన్నీ చేసుకున్నాక ప్లేటులో పెట్టి మడతలు వేయాలి. వీటిపైన పచ్చి కొబ్బరి, కిస్మిస్లు, జీడిపప్పు, బాదంపప్పు, చెర్రీ పెడితే చూడడానికి అందంగా ఉండటమేకాక రుచిగా కూడా ఉంటాయి
తాజా వార్తలు
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్







