ఈద్ అల్ ఫితర్..4 రోజుల సెలవు: భారీగా పెరగనున్న విమాన ఛార్జీలు!
- March 10, 2023
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా UAE నివాసితులకు వరుసగా 4 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం, ఈద్ అల్ ఫితర్ మొదటి రోజు ఏప్రిల్ 21(శుక్రవారం)న ఉంటుంది. దీంతో నివాసితులకు ఏప్రిల్ 20, గురువారం నుండి ఏప్రిల్ 23 ఆదివారం వరకు నాలుగు రోజుల పాటు సెలవులు లభిస్తాయి. ఈ నేథ్యంలో యూఏఈ నుండి ప్రముఖ గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు ఇప్పటికే సుమారు 15 శాతం పెరిగాయను ట్రావెల్ ఏజెంట్స్ తెలిపారు. పవిత్ర రమదాన్ మాసంలో పాఠశాలలకు వసంత విరామం ఉండటంతో కుటుంబాలు విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ Musafir.com ప్రకారం, ట్రావెల్ ప్యాకేజీల కోసం 30 శాతం డిమాండ్ ఉంది.ఎక్కువగా అజర్బైజాన్, జార్జియా, అర్మేనియా, సింగపూర్, కెన్యా, థాయ్‌లాండ్, మలేషియాతో పాటు కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్ లకు వెళ్లేందుకు డిమాండ్ ఉందని ప్లూటో ట్రావెల్స్‌లో మేనేజింగ్ పార్టనర్ భరత్ ఐదాసాని చెప్పారు.
ప్యాకేజీ ధరలు
కాకేసియన్ దేశాలకు 4-రోజుల ప్యాకేజీ ఏప్రిల్ రెండవ వారం వరకు Dh1,499గా ఉన్నది.అయితే ఈద్ సెలవు తేదీలలో వీటి ధరలు రెట్టింపు అవుతాయి. జార్జియా వంటి దేశాల్లో హాలిడే ప్యాకేజీలు Dh3,000 నుండి Dh4,000 ధర పరిధిలో ఉన్నాయి. పారిస్, స్విట్జర్లాండ్‌లకు ఏడు రోజుల ప్యాకేజీలు Dh8,800 నుండి ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







