రాయుడు పాటలు 11న విడుదల..
- May 05, 2016
విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని 'రాయుడు' పేరుతో హరి వేంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇటీవలే గ్లామర్ హీరోయిన్స్ శ్రుతిహాసన్, తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్ విడుదల చేశారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా గురించి విశాల్ మాట్లాడుతూ, పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో విభిన్నమైన సినిమాగా నిలుస్తుందని, ముత్తయ్య అద్భుతంగా తెరకెక్కించాడని, ఆలాగే నా గెటప్ కూడా కొత్తగా వుంటుందని అన్నారు. అన్నిరకాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఇందులో వుంటాయని అన్నారు. నిర్మాత హరి మాట్లాడుతూ, ముగ్గురు టాప్ హీరోయిన్లు ఈ సినిమా టీజర్‌ను సోషల్ మీడియాలో విడుదలచేయడం ఆనందంగా వుందని, ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..









