'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్రంలో కథానాయికగా ఇలియానా..
- May 05, 2016
ఇలియానా.. తెలుగు తెరపై ఈ గోవా భామ కనిపించి చాలా కాలమైంది. 'జులాయి' తరవాత ఈ సన్నజాజిని చూసే అవకాశమే రాలేదు. మధ్యలో కొన్ని ఆఫర్లు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. ఇప్పుడు మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇలియానా సిద్ధమవుతోందని సమాచారం. అందుకు నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం వేదిక కానుందట. బాలకృష్ణ - క్రిష్ కలయికలో 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్రం ఇటీవలే మొదలైంది. ఈ వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. కథానాయికగా చాలామంది పేర్లు పరిశీలించారు. నయనతార, అనుష్క, కాజల్‌లతో పాటు ఇలియానా పేరు కూడా చర్చల్లో వినిపించింది. అనుష్క, నయన కాల్షీట్ల సమస్య వల్ల ఓకే చెప్పలేకపోయారు. ఇప్పుడా ఛాన్స్ ఇలియానాకి దక్కిందని తెలుస్తోంది. ఇలియానా అయితే రాజకుమారిగా సరికొత్తగా ఉంటుందని చిత్రబృందం కూడా భావిస్తోందట. పది రోజుల్లో కథానాయిక ఎవరన్న విషయంలో ఓ స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







