రమదాన్: పాఠశాల వేళలలో మార్పులు
- March 10, 2023
యూఏఈ: రమదాన్ సందర్భంగా దుబాయ్‌లో పాఠశాలల సమయాలు మారాయి. ఐదు గంటల కంటే ఎక్కువ బోధన సమయం ఉండకూడదని నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) శుక్రవారం ప్రకటించింది.దుబాయ్‌లోని GEMS అవర్ ఓన్ ఇండియన్ స్కూల్లోని ప్రిన్సిపాల్ లలిత సురేష్ మాట్లాడుతూ.. స్కూల్స్ సమయాలను నిర్ణయించడానికి KDHA తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయిస్తారని చెప్పారు.ఈ నేపథ్యంలో కొన్ని పాఠశాలలు సోమవారం నుండి గురువారం వరకు 7.45am నుండి 12.45pm వరకు షెడ్యూల్ ప్రకటించాయి. శుక్రవారము మాత్రం సాధారణంగానే స్కూల్స్ నడుస్తాయని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







