షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పుట్టినరోజు : మీకు తెలియని 8 విషయాలు

- March 11, 2023 , by Maagulf
షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పుట్టినరోజు : మీకు తెలియని 8 విషయాలు

యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మార్చి 11న 62వ వసంతంలోకి అడుగుపెట్టారు.దశాబ్దాలుగా ఎమిరేట్స్ ప్రజలకు సేవ చేస్తూ.. ఉదారమైన కష్టపడి పనిచేసే నాయకుడిగా గుర్తింపు పొందారు. అతని తండ్రి దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ వలె మంచి పాలకుడిగా ప్రజల మన్ననలు పొందారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ గురించి మీకు తెలియని ఎనిమిది విషయాలు.
1. పూర్తి పేరు 
షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ బిన్ ఖలీఫా బిన్ షఖ్‌బౌట్ బిన్ థెయాబ్ బిన్ ఇస్సా బిన్ నహ్యాన్ బిన్ ఫలాహ్ బిన్ యాస్
2. షేక్ జాయెద్ మూడవ కుమారుడు
అతను దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ మూడవ కుమారుడు. అతని తండ్రి, అతని తల్లి షేఖా ఫాతిమా బింట్ ముబారక్ పర్యవేక్షణలో పెరిగాడు.అతని జీవితంలో మొదటి 10 సంవత్సరాలలో UAE చరిత్రలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయ.అబుదాబి 1962లో చమురు ఎగుమతిని ప్రారంభించింది; అతని తండ్రి 1966లో అబుదాబి పాలకుడయ్యాడు; UAE 1971లో ఏర్పడింది; అతని తండ్రి అదే సంవత్సరంలో దేశానికి మొదటి అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
3. విద్యాభ్యాసం 
అధికారిక విద్యను ప్రారంభించకముందే, షేక్ మొహమ్మద్ తన సమయాన్ని ఎక్కువగా షేక్ జాయెద్ మజ్లిస్‌లో .. గిరిజన పెద్దలతో గడిపారు. దీంతో జ్ఞాన సంపదను పెంచుకున్నారు.అతను అధికారికంగా 18 సంవత్సరాల వయస్సు వరకు అల్ ఐన్, అబుదాబిలోని పాఠశాలలో చదివారు. అనంతరం రబాత్‌లోని రాయల్ అకాడమీకి కూడా వెళ్ళాడు.
4. హెలికాప్టర్‌ను నడపగలరు 
2023లో UAE బాణసంచా వేడుకలను చూడటానికి వేలాది మంది ప్రజలు ఎదురుచూస్తుండగా.. షేక్ మొహమ్మద్ ఛాపర్‌ను నడిపి ఆశ్చర్యపరిచారు. గతంలో దేశవ్యాప్తంగా హెలికాప్టర్లను పైలట్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. 1979లో ఒక ప్రముఖ మిలిటరీ అకాడమీ నుండి పైలట్ శిక్షణ పూర్తి చేశారు. దీంతో పాటు పారాట్రూపింగ్ కూడా నేర్చుకున్నాడు.
5. ఇద్దరు దత్తపుత్రికలు 
అతను 1981లో షేఖా సలామా బింట్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ నహ్యాన్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు దత్తపుత్రికలు అమీనా, సల్హా ఉన్నారు.
6. రోజుకు 18 గంటలు పని చేస్తారు 
యుఎఇ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. షేక్ మొహమ్మద్ ఎంత కష్టపడతారో వెల్లడించారు. రోజుకు 18 పనిగంటలపాటు పని చేస్తారని, వార్షిక సెలవులు వారానికి మించవని తెలిపారు.
7 . ఫాల్కన్లు, వన్యప్రాణులంటే ఇష్టం 
షేక్ మొహమ్మద్ కు అడవి ఫాల్కన్‌లు, బస్టర్డ్స్‌తో పాటు అరేబియా ఒరిక్స్‌ అంటే చాలా ఇష్టం. తండ్రి వద్ద వారసత్వ క్రీడ నేర్చుకుని.. చిన్నప్పటి నుంచి ఫాల్కన్రీకి అభిమానిగా మారారు.
8. కవిత్వం అంటే ఆసక్తి
కవిత్వంపై లోతైన ఆసక్తి కలిగి ఉన్న షేక్ మొహమ్మద్..ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందిన నాబాతి శైలి అంటే ఇష్టం. కవితల పోటీలు, ఇతర కార్యక్రమాలకు క్రమం తప్పకుండా సహాయాన్ని అందజేస్తారు. వీలైనన్ని ఎక్కువ ప్రోగ్రాంలకు వ్యక్తిగతంగా హాజరవుతారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com