7.4% పెరిగిన అవయవ మార్పిడి చికిత్సలు
- March 11, 2023
మస్కట్ : సుల్తానేట్లో అవయవ దానం అంగీకారం పెరుగుతోంది. అవయవ మార్పిడి శస్త్రచికిత్సల నుండి ఎక్కువ మంది వ్యక్తులు ప్రయోజనం పొందుతున్నారు. సౌత్ షర్కియాలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సౌద్ బిన్ అమెర్ అల్ నధ్రీ ప్రకారం, ఒమన్లో ఇప్పటివరకు 347 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించబడ్డాయి.2022లో ఇరవై నాలుగు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. 2021 కంటే ఇది 7.4 శాతం ఎక్కువ.ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) ప్రకారం, సుల్తానేట్లో 2021 చివరి వరకు 323 అవయవ మార్పిడి చికిత్సలు జరిగాయి. వివిధ రంగాల నుండి మొత్తం 7,092 మంది వ్యక్తులు అవయవ దానం కోసం షిఫా యాప్లో నమోదు చేసుకున్నారు. 1988 నుండి సుల్తానేట్లో మొత్తం అవయవ మార్పిడి 347 జరిగాయని, అందులో 325 కిడ్నీ మార్పిడి కాగా.. 22 కాలేయ మార్పిడి చికిత్సలు ఉన్నాయని సౌద్ బిన్ అమెర్ అల్ నధ్రీ తెలిపారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







