ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
- March 11, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు ఈడీ ముందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ఈడీ అధికారులు కవితను విచారించడం మొదలుపెట్టారు. దాదాపు 09 గంటలపాటు కవిత ను విచారించిన అధికారులు తిరిగి 16 న మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేశారు. విచారణ మధ్యలో 10 నిమిషాల పాటు కవిత కు బ్రేక్ ఇచ్చారు. విచారణ పూర్తి కాగానే కవిత నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈడీ వైఖరితో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి.
అయితే.. కవిత బయటికి రాగానే.. బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషాలు మొదలయ్యాయి. జై కవిత..జై కేసీఆర్ ..జై బిఆర్ఎస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఉదయం కవిత ఈడీ విచారణకు వెళ్లే సమయంలో అంత షాక్ లో ఉన్నారు. విచారణ పూర్తి కాగానే కవిత ను అరెస్ట్ చేస్తారనే వార్తలు ప్రచారం జరగడం తో కాస్త ఆందోళన చెందారు. సాయంత్రం నాటికీ కవిత బయటకు వస్తారని తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరికాసేపట్లో ఎమ్మెల్సీ కవిత, మంత్రులు హరీష్ రావు , కేటీఆర్ లు హైదరాబాద్ కు రాబోతున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







