ప్రేక్షకులను అలరించిన 'మెగా మ్యూజికల్ నైట్'
- March 11, 2023
ఖతార్: దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా మ్యూజికల్ నైట్ (మార్చి 3న)ప్రేక్షకులను అలరించింది. ఇందులో భారతదేశం, పాకిస్తాన్, నేపాల్ నుండి ప్రవాస ప్రతిభావంతులైన సంగీతకారులు, కళాకారులు పాల్గొన్నారు.దోహా మ్యూజిక్ లవర్స్ మెగా మ్యూజికల్ నైట్ విజయం సాధించడంపై గ్రూప్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సయ్యద్ రఫీ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి న్యూ టెక్ ఇంజనీరింగ్-సర్వీసెస్, అల్ అక్వా నియోన్, సోనూ కౌంట్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. ఈ కార్యక్రమంలో టీపీఎస్ అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్, తెలంగాణ ఫుడ్ సన్కాన్స్ ఎండీ ప్రవీణ్ బయ్యాని, ఐసీబీఎఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ కేఎస్ ప్రసాద్, ఐసీసీ జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్, టీజేక్యూ అధ్యక్షురాలు నందిని అబ్బగోని, ఏఎంయూ చైర్మన్ జావేద్ అహ్మద్, ఏఎంయూ అధ్యక్షుడు సయ్యద్ జాఫ్రీ, సెంట్రల్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షుడు జై ప్రకాశ్ సింగ్, ఏకేవీ అధ్యక్షుడు వెంకప్ప భాగవతుల, ఏకేవీ కార్యదర్శి విక్రమ్ సుఖవాసి, జైదా మోటార్స్ సీనియర్ మేనేజర్ కేటీ రావు, తెలంగాణ ప్రజాసమితి కార్యదర్శి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)


తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







