సౌదీలో రమదాన్ మాసం: అధిక ఉష్ణోగ్రతలు, వర్షాలు!
- March 15, 2023
రియాద్: పవిత్ర రమదాన్ మాసంలో సౌదీ అరేబియాలో సగటు కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడంతోపాటు పలు ప్రాంతాలలో వర్షాలు పడనున్నాయి. మార్చి 23 నుండి ఏప్రిల్ 20 వరకు పవిత్ర రమదాన్ మాసంలో వాతావరణ పరిస్థితులపై నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) నివేదిక సమర్పించింది. రాజ్యంలోని చాలా ప్రాంతాలలో రమదాన్ లో సగటు ఉష్ణోగ్రత పెరుగుతుందని నివేదిక తెలిపింది. మదీనా, మక్కా, అసిర్, జజాన్, టబుక్, నార్తర్న్ బోర్డర్స్ రీజియన్‌లోని కొన్ని ప్రాంతాలు, అల్-జౌఫ్ ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాలలో సగటు ఉష్ణోగ్రత ఒకటిన్నర డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుందని ఎన్సీఎం అంచనా వేసింది. అదే సమయంలో రమదాన్ సమయంలో రాజ్యంలో చాలా ప్రాంతాలలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షం కురుస్తుందని నివేదిక తెలిపింది. పవిత్ర మాసం మొదటి వారంలో ముఖ్యంగా రియాద్, హేల్, ఖాసిమ్, అల్-జౌఫ్, ఉత్తర సరిహద్దుల ప్రాంతం, మక్కా, అసిర్, జజాన్ ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలలో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







