నిర్మాణంలో ఉన్న హోటల్‌లో అగ్నిప్రమాదం

- March 15, 2023 , by Maagulf
నిర్మాణంలో ఉన్న హోటల్‌లో అగ్నిప్రమాదం

మస్కట్‌: మస్కట్‌ గవర్నరేట్‌లోని విలాయత్‌ ఆఫ్‌ సీబ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ అథారిటీ (సీడీఏఏ) ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది కష్టపడినట్లు సీడీఏఏ తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com