ఫిష్ ఫ్రై గ్రీన్ మసాలా
- May 05, 2016
కావలసిన పదార్థాలు: పచ్చి చేప ముక్కలు, గ్రీన్ మసాలా పేస్ట్ కోసం: పుదీనా - అర కట్ట, కొత్తిమీర - అరకట్ట, కరివేపాకు - 2 రెమ్మలు, పచ్చిమిర్చి -3, మసాలా కోసం: పసుపు - అర టీ స్పూను, గరం మసాలా - 1 టీ స్పూన్, ధనియాలపొడి - 1 టీ స్పూన్, జీలకర్ర పొడి - అర టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్, కారం - 1 టీ స్పూన్, మిరియాల పొడి - అర టీ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నిమ్మకాయ - 1, ఆలివ్ ఆయిల్ - 2 టీ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్ - 1 టేబుల్ స్పూన్, బియ్యప్పిండి - అర టేబుల్ స్పూన్, నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి. వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. చేప ముక్కల్ని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ పిండేయాలి. కడిగి పెట్టిన చేపముక్కల్లో పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మిరియాల పొడి, గ్రైండ్ చేసి పెట్టిన గ్రీన్ మసాలా పేస్ట్ వేయాలి. మసాలా పొడులు, గ్రీన్ మసాలా పేస్ట్ అన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలపాలి. 2 టీ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. నిమ్మకాయ రసం కూడా ముక్కలకి పట్టేట్లు కలపాలి. చివరిగా కార్న్‌ఫ్లోర్, బియ్యప్పిండి వేసి కలపాలి. మసాలాలన్నీ కలిపిన చేప ముక్కల్ని పావుగంట నానబెడితే మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది. మారినేట్ చేసిన చేపముక్కల్ని బాగా కాగిన నూనెలో మీడియం మంట మీద డీప్‌ఫ్రై చేయాలి. ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీరతో అలంకరించుకుంటే గ్రీన మసాలా ఫిష్ ఫ్రై రెడీ.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









